అల్ఫా హోటల్ పై తప్పుడు ప్రచారం.. ఖండించిన యాజమాన్యం

నవతెలంగాణ హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌పై వివిధ వచ్చిన నిరాధార వార్తా కథనాలను హోటల్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా లో వేరే హోటల్ ఫోటోలు పెట్టి ఆల్ఫా హోటల్ ఫోటోలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటి హోటల్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. 75 ఏండ్లుగా తమ ప్రఖ్యాతి గాంచిన హోటల్‌ ప్రతిరోజూ వేలాది మంది భోజన వసతి కల్పిస్తోందని, నాణ్యత లేని అపరిశుభ్రమైన ఆహారాన్ని ఎప్పుడూ అందించలేదని వారు తెలిపారు.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చిన్నచిన్న సమస్యలను గుర్తించారని వారు చెప్పరు. వీటిని సరిదిద్దడానికి, అవసరమైన మార్పులు చేస్తామని యాజమాన్యం ప్రతిజ్ఞ చేసింది. హోటల్ మేనేజ్‌మెంట్ ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అధికారులు బహిరంగ ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలించాలని, తయారుచేసే ప్రక్రియలో బేకరీ ఫుడ్ ఐటమ్స్ కవర్ చేయాలని, బేకరీ ఫుడ్స్‌పై లేబుల్స్, తేదీలను ముద్రించాలని మాత్రమే సూచించారని తెలిపారు.
వివిధ పత్రికల్లో వచ్చినట్టు పాచిపోయిన మాంసం వాడుతున్నాం అనేది అవాస్తమని,  అలాంటి కథనాలు రాసిన సోషల్ మీడియా వారు వాస్తవ వాస్తవాలను గమనించాలని, నష్టం కలిగించే వార్తా కథనాలను సరిదిద్దాలని వారు అభ్యర్థించారు.

Spread the love