ముఖ్యమంత్రుల భేటీ అభినందనీయం

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే సమరసింహారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కావడం అభినందనీయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే సమరసింహారెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించుకోవడం, సామరస్యంగా పరిష్కరించుకోవడం సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. కృష్ణా బేసిన్‌లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాల్సిందేనన్నారు. ఆ సమస్య పరిష్కారం కాకుండా పెన్నా బేసిన్‌ను తీసుకెళతామని చెప్పడం సరైందికాదని విమర్శించారు. వీటన్నింటిపై కులంకషంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కోరారు.

Spread the love