నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం స్థల వివాదం విషయంలో కొందరు వ్యక్తులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 265 సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించిందని, 264 సర్వే నెంబర్ లో గల 4 ఎకరాల 8 గుంటల భూమి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిందని తెలిపారు. కాగితాల ప్రకారం ఎల్లమ్మ టెంపుల్ ఉన్న నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి కంటే ఒక ఇంచు భూమి ఎక్కువగా ఉన్న సదరు వ్యక్తులు ఆ భూమిని తీసుకోవచ్చని పేర్కొన్నారు. సర్వే నెంబర్లు లేని రోజుల్లోనే 12వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి హుస్నాబాద్ లో ఎల్లమ్మ టెంపుల్ నిర్మించారని వెల్లడించారు. భూమి వివాద విషయంలో కోర్టుకు వెళ్లిన వ్యక్తులు కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగకుండా మీడియాలో అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 756 సంవత్సరాల చరిత్ర గల ఎల్లమ్మ దేవాలయానికి ఎవరు భూమి దానం చేయలేదని, భూ పహానిలో ముగ్గురి పేర్లు ఉండటంతో 2005 వ సంవత్సరంలో అప్పటి ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి ఆ ముగ్గురు వ్యక్తుల నుండి దాన పత్రాలు రాయించుకోని భూమిని పూర్తిగా దేవాలయం పేరు మీద చేయడం జరిగిందన్నారు. భూ వివాద విషయంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పై బురదల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని సూచించారు. రికార్డుల ప్రకారం ఎల్లమ్మ గుడికి ఉండాల్సిన 4 ఎకరాల నాలుగు గంటల భూమి కంటే ఒక ఇంచు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని మీడియా మిత్రులు, మేధావులు, ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేకల వీరన్న యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.