
– చూసీ చూడనట్టు వదిలేస్తన్న అధికారులు
– లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం
నవతెలంగాణ – తాడ్వాయి
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరకు కోటి యాభై లక్షలకు భక్తులు వస్తారని, వారి తాగునీటి సౌకర్యార్థం ఆర్డబ్ల్యూ శాఖ ద్వారా బోరింగ్ (చేతి పంపులు) పంపులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మేడారం మహా జాతరకు ములుగు ఘట్టం నుండి మేడారం వరకు, కొండాయి మల్యాల దొడ్ల నుండి మేడారం వరకు, లింగాల నుండి మేడారం, తాడ్వాయి టు మేడారం, బయక్కపేట, సింగారం, కాల్వపల్లి టూ మేడారం వరకు గతంలో వేసిన బోరింగులను సుమారు 400 నుండి 350 వరకు బోరింగులు అందుబాటులోకి తెస్తారు. ఈ బోరింగులు ప్రతి సంవత్సరం మురుకు నీరు బురద బయటకు తీసేసి, ఫ్లషింగ్ చేస్తారు. ఈ సంవత్సరం ఎన్ని బోరులు ఉన్నాయి. ఎన్ని బోర్లు దొంగలు అన్ని ఖరాబ్ అయినాయి. ఏ బోరుకు ఎంత సామాను పడుతుంది. పార్టీ ఫ్లాట్ ఫామ్ ల పరిస్థితి ఏంటి అని సర్వే చేసిన తర్వాత వాటి కావాల్సిన సామాన్లకు మెటీరియల్ కు ప్లషింగ్ కు అందరూ పిలవాల్సి ఉంటుంది. అని గత జాతరలో అవసరంలేని దొంగలు దొంగిలించిన పోయిన బోర్లను గుర్తించకుండా గుత్తేగారు ప్లషింగ్ పనులు చేస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ లలో తాడువాయి రూట్ లో చిలకలగుట్ట విఐపి పార్కింగ్ నార్లపు పార్కింగ్ కొత్తూరు సబ్స్టేషన్ ఆపోజిట్ పార్కింగ్ జన సందోహం ఉండే వివిధ ప్రదేశాలలో ప్లషింగ్ చేయకుండా వదిలేస్తున్నారు. చేతిపంపులకు సంబంధించిన అధికారులు వెంట లేకుండానే గుత్తేదార్ ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా ఆయన కనపడ్డ బోరింగ్ నే ప్లషింగ్ పనులు చేస్తున్నారు. గత జాతరల లో నిష్ణాతులైన అనుభవం కల మెకానికులతో బోర్ పంపుల ప్లషింగ్ నిర్వహణ ఉండేది. ఇప్పుడు అలాంటిది జరగడం లేదు.
నిరంతరం నడిచే చేతిపంపులకు ప్లషింగ్ చేయరాదు. నడిచే చేతిపంపులకు ప్రెస్సింగ్ చేయడం వలన బోరు కూలిపోయే ప్రమాదం ఉంది. గుత్తేదారు ఆయన కౌంటు రావడం కొరకు రోడ్డుమీద పనిచేసే చేతిపంపులను ఆయన కనపడ్డ చేతిపంపులను మాత్రమే ప్లషింగ్ చేస్తున్నారు. వివరాలు ఎవరిని అడిగిన సమాధానం చెప్పడం లేదు. గత యాత్రలో ప్రెస్సింగ్ చేసే టైంలో బోర్వెల్ వర్గాలకు తలకు హెల్మెట్ పెట్టి ప్రెస్సింగ్ చేసేవారు. ప్రస్తుతం హెల్మెట్ లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదం జరిగితే తలకు దెబ్బలు జరిగే ప్రమాదం ఉంది. జాతరలో అలాంటి ముందు జాగ్రత్త పనులు చేపట్టడం లేదు. బోరు ప్రెస్సింగ్ పనులు ల్యాబ్ టెక్నిషన్ పర్యవేక్షణలో క్లోరినేషన్ చేసి నీటిని షాంపూలు సేకరించి వాటి నాణ్యత పరిశీలించిన తరువాత ఉపయోగం లోకి వచ్చేది. ఈ జాతరలో అలాంటిది జరగడం లేదు. ఈ బోరింగ్ ల నీరు తాగి అస్వస్థకు గురై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటరీ అప్స్ టాప్స్ ద్వారా మీరు నిరంతరం ప్రవహించి ఆ పరిసరాలు బురదమయంగా మారే అవకాశం ఉంది. చేతిపంపుల ద్వారా నైతేనే భక్తులకు నీరు సద్వినియోగపడుతుంది. చేతి పంపులు పనుల్లో అధికారులు, గుద్దదారులు, నాయకులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు నీరందించే ముఖ్యమైన వనరు బోరింగులకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.