హైదరాబాద్ : నగరంలోని సోమాజిగూడ కీర్తిలాల్ షోరూమ్ లో కొత్తగా ‘ది మ్యూజ్ బై కీర్తిలాల్స్’ కలెక్షన్స్‌ను ఆవిష్కరించి నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ అభరణాలు ఫ్యాషన్ ప్రేమికులను ఆకర్షిస్తాయని పేర్కొంది. ఆధునిక మహిళకి నచ్చేలా, ఆధునిక డిజైన్లు, కీర్తిలాల్స్ సంప్రదాయ శిల్పకళా నైపుణ్యాన్ని సమ్మిళితం చేసి రూపొందించినవని కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ తెలిపారు. సూక్ష్మమైన డిజైన్లు, వినూత్న నమూనాలు, బహుముఖ ప్రత్యేక దృష్టితో వీటిని అందుబాటులోకి తెచ్చామన్నారు. సంప్రదాయ ఆధునిక దుస్తులకు సరిగ్గా సరిపోయే స్టేట్మెంట్ నెక్లెస్లు, సొగసైన చెవిపోగులు, వివిధ డిజైన్లలో ఉన్న ఉంగరాలు, కంకణాలు సహా విభిన్న తరహా ఆభరణాలు ప్రదర్శన, విక్రయానికి పెట్టామన్నారు.