నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలి

 –  పివైఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు దేశెట్టి సాయిరెడ్డి.
నవతెలంగాణ – మాక్లూర్ 
భవిష్యత్తు తరాల ప్రజలకు వైద్యం అందించే వైద్య విద్యార్థిని విద్యార్థులకు నీట్ పరీక్ష పేపర్ ని 30 లక్షలకు అమ్మడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి  వాళ్లపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని  ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు దేశెట్టి సాయి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బోర్గం (కే) గ్రామంలో పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇదంతా జరిగినా గాని భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా మోడీ జోక్యం చేసుకొని నీటి పరీక్షను రద్దుచేసి మళ్లీ పరీక్షను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు పిలుపుమేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తే, విద్యార్థి యువజన సంఘాల నాయకులపై  లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, విద్యార్థి యువజన సంఘాల నాయకులపై లాఠీచార్జి చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. .అరెస్టు చేసిన విద్యార్థి యువజన సంఘాల నాయకులను బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Spread the love