గ్రామీణ స్థాయి క్రీడలను నూతన ప్రభుత్వం ప్రోత్సహించాలి

నవతెలంగాణ- వలిగొండ రూరల్
నూతన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలని, దాని కోసం ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు నిర్వహించి , అధిక నిధులు కేటాయించాలని  డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు అన్నారు.  ఆదివారం పులిగిల్ల గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లతో కలిసి ప్రారంభించిన  అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్  మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గ్రామీణ స్థాయిలో ఉన్న యువతను వారి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయకుండా నిర్లక్ష్యం వహించారని  నూతన ప్రభుత్వం అయినా గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు నిర్వహించి అధిక నిధులు కేటాయించాలని అన్నారు.  గ్రామాలలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి క్రీడాకారులను ప్రోత్సహించి వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని, ప్రభుత్వం నుండి ప్రోత్సాహం గ్రామీణ స్థాయి క్రీడలకు అధికంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. గ్రామాలలో అనేకమంది క్రీడాకారులు మట్టిలో మాణిక్యాల లాగా ఉన్నారని వారిని పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వారి నైపుణ్యం కనుమరుగయ్యి గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రాధాన్యత లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గ్రామాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలలో క్రీడా సామాగ్రి లేక వెలవెలబోతున్నాయని వారు అన్నారు. క్రీడలకు ప్రారంభ  సూచికగా  డివైఎఫ్ఐ జెండాను గ్రామ శాఖ కార్యదర్శి వడ్డేమాన్ మధు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమనికి ఎస్ఎఫ్ఐ గ్రామశాఖ కార్యదర్శి వేముల జ్యోతి బస్ అధ్యక్షత వహించగా  ఈకార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సిర్పంగి స్వామి, క్రీడోత్సవాల దాత కళ్లెం  సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి ఎంపిటిసి బండారి ఎల్లయ్య,ఉప సర్పంచ్  పైళ్ళ రవీందర్ రెడ్డి సీఐటియు రాష్ట్ర నాయకులు పైళ్ళ గణపతి రెడ్డి,బుగ్గ చంద్రమౌళి, రైతు సంఘం నాయకులు వాకిటి వెంకట్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ గ్రామ శాఖ కార్యదర్శి బుగ్గ ఉదయ్ కిరణ్, నాయకులు వేములచంద్రయ్య, మరబోయిన నరసింహ, దొడ్డి బిక్షపతి, విద్యా కమిటీ చైర్మన్ వేముల  యేసయ్య,డివైఎఫ్ఐ నాయకులు వరికుప్పల నరసింహ, వడ్డేమాన్ రవి, మారబోయిన ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love