నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం సంగారం గ్రామంలో నేటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందని దానికి వెంటనే రూపు మాపాలని కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఖండించారు. బుధవారం కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం. నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం సంగారం గ్రామంలో గురువారం కుల వివక్ష రూపాలపై సమగ్ర సర్వే నిర్వహించి మాట్లాడారు.స్వాతంర్యంవచ్చి 78 ఏళ్ళు అయినా ఇంకా ఇప్పటికి దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందని అన్నారు.పెద్దవూర మండలం సంగారం గ్రామం లో నేటికీ ఆంజనేయ స్వామి దేవాలయంలోకి దళితులను రానివ్వరని కనీసం అరుగుల పైన కూర్చోనివ్వక పోవడం దారుణ మైన చర్య అని అన్నారు. దసరా పండుగకు దళితులు జమ్మి వద్దకు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. పెళ్లిళ్లకు ఇతర కార్యాలకు దళితులకు, బీసీ కులాలకు ఎటువంటి సంబంధాలు ఆ గ్రామంలో లేవని తెలిపారు. రెండు గ్లాసుల విధానానికి బదులుగా దళితులు, దళిత కూలీలు పనికి వెళితే సపరేట్ బిందె, సపరేట్ చెంబు ఉండడం అన్యాయం అన్నారు. కూలీలకు కూలి డబ్బులు కూడా చేతికి ఇవ్వరని,అరుగులపై లేదా నేలపై పెడతారని తెలిపారు, బాపూజీ కలలు కన్న స్వాతంత్ర్యం ఇదేనా అని ప్రశ్నించారు. దళితుల వివక్ష రూపాల పై త్వరలో ప్రతిఘటన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వివక్షత రూపాలపై ప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ సభ్యులు దొంతాల నాగార్జున,దోరేపల్లి మల్లయ్య, మాతంగి బిక్షమయ్య, తరి రామకృష్ణ, నర్లపల్లి రమేష్, మాతంగి అశోక్, మాతంగి కరుణాకర్, మాతంగి దయాకర్, మాతంగి శ్రీరాములు, మాతంగి గణేష్, బొంగరాల జానయ్య, కొరిమి పద్మ, తరి జయమ్మ, ఉంగరాల లక్ష్మమ్మ, మాతంగి విమలమ్మ, కోటమ్మ, మాతంగి రాజు, మాతంగి గణేష్* తదితరులు పాల్గొన్నారు.