– గడ్డం ప్రసాద్ ను ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నుకోవడం అభినందనీయం..
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
ఎన్నో ఆశలతో ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై సభ్యులు మాట్లాడేటప్పుడు ఆంక్షలు విధించకుండా అధికారపక్షం ప్రతిపక్షం అని తేడా లేకుండా సభ్యుల సమస్యలతో పాటు నియోజకవర్గ , రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవసరమైన సమయంలో ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం అసెంబ్లీ లో నూతనంగా స్పీకర్ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కు కోరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మూడోసారి జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నుకోవడం అభినందనీయమని అని అన్నారు. కష్టపడి పైకి వచ్చిన తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే ఉన్నతమైన పదవి వస్తదని ఆశించాను కానీ అంతకుమించి గౌరవపదమైన పదవి రావడం చాలా ఆనందం కలిగిందని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు సభలో మాట్లాడేటప్పుడు సమయం కావాలని కోరుతుండడంతో రాజగోపాల్ రెడ్డి గత అసెంబ్లీలో మూడున్నర సంవత్సరాలు తను అనుభవించిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని సమస్యలను రాష్ట్రంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చేందుకు మాట్లాడుతుంటే సభ్యుల సంఖ్య ప్రమాణంగా నిమిషం నిమిషం లెక్కపెట్టుకుంటూ మాట మాటకు అడుగు అడుగున అడ్డంకులు ఉండేవి అధ్యక్ష అని సభ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయి ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యములు కాపాడే విధంగా ప్రశ్నించే గొంతుకలకు ప్రజల పక్షాన ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు వారి సమస్యలు కానీ, నియోజవర్గ రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పించాలని కోరారు . గత చేదు అనుభవాలను చెప్పదలుచుకోలేదు కానీ స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలలో ఏది మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సభ సజావుగా సాగేందుకు అధికార పక్షం, పార్టీ పక్షాన అందరికీ సహకారం ఉంటుందని తెలిపారు. ఐదు సంవత్సరాలు అధ్యక్ష పదవి రాష్ట్రంలోని సమస్యల పైన మాట్లాడేందుకు అధికారపక్షం ప్రతిపక్షం అనే వివక్ష లేకుండా స్పీకర్ పదవికి వన్నె తెచ్చే విధంగా నడుచుకోవాలని సూచించారు.