మూడు లక్షల విలువ చేస్తే సెల్ఫోన్లను రికార్డు చేసిన ఒకటవ పోలీసులు

– అభినందించిన నిజామాబాద్ ఏసిపి
నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఫోన్లను రికవరీ చేసినట్లు నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ గురువారం తెలిపారు.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అద్భుత ఫలితాలను ఇస్తోందని తమ పోలీస్ శాఖ ద్వారా నిరంతరం ప్రత్యేకంగా దీని కోసం పని చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ లను ఏర్పాటు చేశామని ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒకటవ  పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఫోన్లను రికవరీ చేయగా అందులో ఒక ఐఫోన్ ఉండగా కేవలం ఒక ఫోన్ విలువే లక్ష రూపాయలు ఉండగా మిగతా తొమ్మిది ఫోన్ల విలువ రెండు లక్షలు ఉందని తెలిపారు. ఈ పోర్టల్ సిస్టం ప్రారంభమైనప్పటి నుండి సుమారు ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలోని 50 వరకు సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అనగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలోనే అందజేయడం జరిగిందని వివరించారు. ఈ పోర్టల్ ద్వారా పనిచేస్తూ ఫోన్లను రికవరీ చేసిన ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తోపాటు ఒకటవ పోలీస్ స్టేషన్ పోలీసుల బృందాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ అభినందించారు. ప్రజల సైతం సెల్ ఫోన్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు.
Spread the love