– ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
నగరంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నగర కమిటీ అధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించాలని మేయర్ క్యాంప్ కార్యాలయంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో దుబ్బ హై స్కూల్,మోడ్రన్ హై స్కూల్, దరుగాల్లీ హై స్కూల్ నందు మంచి నీటి సౌకర్యం కూడా లేకపోవడం వలన విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు.అలాగే మన ఊరు – మన బడి పథకం పనులు కూడా నత్త నడకన సాగుతున్నాయి.అదే విధంగా మొన్న ఒక రోజు కురిసిన వర్షానికి దుబ్బ, శంకర్ భవన్ స్కూల్ నందు వర్షం నీరు నిలువ అయ్యి, విద్యార్థులకు నడవడం కూడా ఇబ్బంది అయ్యింది. అని ఈ సమస్యల పరిష్కారం కోసం నగర మేయర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. నగర మేయర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు గణేష్ నగర నాయకులు సాయి, బాబు రావు, నితిన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.