
రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రజా ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన కమ్మర్ పల్లి, వేల్పుర్ మండలంలోని వేల్పూర్, అంక్సాపూర్, అక్లూర్ గ్రామాలలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రజా ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందన్నారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లిలో టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, పంచాయతీ కార్యదర్శి గంగాజమున, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, వేముల గంగారెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.