జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల దాడులు ముమ్మరం

– అక్టోబర్ 9 నుండి 30 అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా పట్టుకున్న వాటి వివరాలను వెల్లడించిన ఎక్సైజ్ సూపర్డెంట్
నవతెలంగాణ- కంఠేశ్వర్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తేదీ.09.10.2023 నుండి 30.10.2023 వరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 165 లీటర్ల నాటు సారాయి, 21525 లీటర్ల బెల్లం ఊట, 19905 లీటర్ల అక్రమ కల్లు, 412.13 లీటర్ల అక్రమ మద్యం, 408.85 లీటర్ల బీరు, 5.61 లీటర్ల దేశి దారు మద్యం, 7.93 లీటర్ల మహారాష్ట్ర నాన్ డ్యూటీ లిక్కర్, 1266 కేజీల సారాయి తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం, 179 కేజీల పటిక,5 కేజీల క్లోరల్ హైడ్రేట్, 39.9 కేజీల గంజాయి,20 గంజాయి మొక్కలు,2, ఫోర్ వీలర్స్, 6 టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా 66,15,255/– రూపాయల విలువ గల అక్రమ మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలు సీజ్ చేసినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే.మల్లారెడ్డి తెలిపారు.అలాగే జిల్లా ఎక్సైజ్ కార్యాలయం లో 24/7 పనిచేసే విధముగా కంట్రోల్ రూం(08462237601) ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఎవరికైన అక్రమ మద్యం, మత్తు పదార్థాల సమాచారం ఉంటే కంట్రోల్ రూం కి తెలియజేయగలరని తెలిపారు. రానున్న రోజుల్లో దాడులు మరింత ఉదృతం చేసి అక్రమ మద్యం, మత్తు పదార్తలను ఉక్కుపాదం తో అణచి వేసి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించుటకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే.మల్లారెడ్డి  తెలిపారు.
Spread the love