దీక్ష దివాస్ కు తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు..

BRS ranks moved to Diksha Diwas..నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి  మండలంలోని ఆయా గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో పలు వాహనాల్లో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ నవంబర్ 29, నాడు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక రోజు అన్నారు. కేసిఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో అంటూ 2009, నవంబర్ 29న  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజన్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివాస్ పేరుతో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. దీక్ష దివాస్ కు తరలి వెళ్ళిన వారిలో రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, లుక్క గంగాధర్, పెరుమాండ్ల రాజా గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలావత్ ప్రకాష్, మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
Spread the love