లాభాల స్వీకరణ కోసమే ఎఫ్‌ఐఐల విక్రయం

Selling of FIIs is for realization of profit– మంత్రి నిర్మలా సీతారామన్‌
ముంబయి : విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ)లు లాభాల స్వీకరణ కోసమే భారత ఈక్విటీలను విక్రయిస్తున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలం అందుతోందని సోమవారం ఆమె ముంబయిలో మీడియాతో అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు మెరుగైన రాబడులు ఇచ్చే వాతావరణం ఉందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఒడుదొడు కుల్లో ఎఫ్‌ఐఐల విక్రయం కూడా ఒక్కటని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన ఎఫ్‌ఐఐలు తిరిగి వారి దేశానికి వెళ్లిపోతున్నాయన్నారు. ధరలను స్థిరంగా ఉంచేందుకు సరఫరాకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతోందని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. డిమాండ్‌కు సంబంధించి ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

Spread the love