మండలంలోని దోస్ పల్లి గ్రామంలో నరేంద్ర మహారాజ్ ఆశీర్వాదంతో జుక్కల్ ఆర్ఎంపి వైద్యుడు సుధాకర్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ను రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం నాడు మొదటి రోజు ప్రారంభమైన చుట్టుపక్కల గ్రామాల రోగులు ఎక్కువమంది రావడంతో శుక్రవారం నాడు కూడా ఉచిత వైద్య శిబిరం రెండవ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా నిన్న నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షలు, బిపి, షుగర్ గుండెకి సంబంధించిన సమస్యలు, రక్తహీనత పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు రోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం, మంచి త్రాగు నీళ్లు , నీడ కొరకు టెంట్ వేయడం జరిగింది . ఉచిత వైద్య శిబిరంలో పేద ప్రజలు మారుమూల గ్రామాల వారు భారీగా తరలిరావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు సుధాకర్ ఆర్ఎంపి బృందం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.