రెండో రోజు ప్రశాంతం..

– మూడు కేంద్రాల పరిధిలో 33 మంది గైర్హాజర్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారం కు రెండో రోజు ప్రశాంతంగా జరిగాయి.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జూనియర్,టి.ఎం.ఆర్,వీకేడీవీఎస్ ఆర్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల పరిధిలో రెండో సంవత్సరం తెలుగు/హిందీ/ఉర్దూ/సంస్క్రతం సబ్జెక్టులో మొత్తం 890 మంది విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి ఉండగా,857 మంది విధ్యార్ధులు పరీక్షలకు హాజరు అయ్యారు. 33 మంది విద్యార్ధులు గైర్హాజరు అయ్యారు. తహశీల్ధార్ ఎం.శ్రీనివాస్,సీఐ కరుణాకర్,ఎస్.హెచ్.ఒ ఎస్ఐ శ్రీను లు బందోబస్తు ను పర్యవేక్షించారు. ఈ పరీక్షా కేంద్రాలకు చీప్ సూపరింటెండెంట్,డిపార్ట్మెంట్ ఆఫీసర్ లుగా దామెర నరసింహారావు,అలవాల వెంకటేశ్వరరావు,రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.శివప్రసాద్ లు విధులు నిర్వహిస్తున్నారు.
పరీక్షా కేంద్రం       ఎలాట్మెంట్       ఆబ్సెంట్     ప్రజెంట్ 
జి.జేసి                   398            23             375
టిఎం ఆర్ జేసీ         188            05             183
వీకేడీవీఎస్ఆర్ జేసీ    304            05             299
మొత్తం                  890            33             857
Spread the love