తొలకరి వర్షానికే విత్తనాలు వేశారు..

– వర్షం లేక పెడబొబ్హలు..
– పెట్టుబడి నష్టం.. రైతుల పాలీట శాపం..
నవతెలంగాణ – జుక్కల్
మెున్న వర్షం పడిందని విత్తుకున్నారు , ప్రస్తుతం వర్షాలు పడటం లేదని విత్తిన మెలకెత్తడం కష్టంగా ఉందని మండలంలోని  పలు  గ్రామాల  రైతులు లబోదిబో మని మెత్తుకుంటున్నారు. మండలంలో మెుత్తం ముప్పై తొమ్మిది వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. జుక్కల్ మండలంలో అన్నిరకాలైన పంటలు పండించే భూములు ఉండటంతో కూరగాయలు, పండ్ల తోటలు, ఖరీఫ్ లో సాయా, పెసర, మినుము, పత్తి, కందులు, తో పాటు ఖరీప్ పంటలు అనవాయితిగా పండిస్తు వస్తున్నారు మండల రైతులు. ఇటివలే జుక్కల్ మండలంలో మూడూ రోజుల క్రితం వర్షం పడటంతో రైతులు అదరబాదరగా తందర పాటు పడి ఖరీదైన ఎరువులు, విత్తనాలు కోనుగోలు చేసి విత్తేశారు. ప్రస్తుతం విత్తిన నాటి నుండి నేటి వరకు వర్షాలు పజక పోవడంతో పెట్టుబడి నష్టం వాటిల్లే ప్రమాదం చోటు చేసుకుందని రైతులు బాద పడుతున్నారు. ఎప్పడికి రైతులకు ప్రకృతి వింతగా ప్రవర్తిస్తు ఇవసరం ఉన్నప్పుడు వర్షాలు పడవు  కానీ అనవసరం ఉన్నప్పుడు వర్షాలు పడటం  ప్రతిఏటా సహజంగా  మారింది.
Spread the love