ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక పరదర్శకంగా జరగలేదు

నవతెలంగాణ-కొత్తగూడ: సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ను పురస్కరించుకొని ఇచ్చిన అవార్డు ల ఎంపిక పారదర్శకంగా జరగలేదని టీఎస్ ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిద్దబోయిన బిక్షం విమర్శించారు. ఐటిడిఎ ప్రకటించిన ఉపాధ్యాయ అవార్డులు పరదర్శకంగా నిర్వహించాలని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల లకు సక్రమంగా వెళ్ళని ఉపాధ్యాయులకు అవార్డులు ఎలా ఇస్తారన్నారు.ఇప్పుడు ప్రకటించిన అవార్డు ల వల్ల నిజాయితీ గా పనిచేసే ఉపాధ్యాయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ప్రస్తుతం ప్రకటించిన అవార్డు లను రద్దు చేసి మళ్ళీ పరదర్శకంగా సర్వే చేసి నిజాయితీ గా విద్యబుద్దులు నేర్పే ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేసి  అవార్డులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంట సూర్యనారాయణ, టీఎస్ ఏటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వాసం కృష్ణ, టీఎస్ యూటీఎఫ్ మండల అడ్వయిజర్ కమిటి సభ్యులు మద్దెల హరినాదం, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు జోగా రవికుమార్, రేగా పాపారావు, సుంచ రమేష్, ఐలబోయిన జంపయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love