దశరథ మెమోరియల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

– ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్,  నగదు, షీల్డ్ బహుకరణ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2003లో స్థాపించబడిన దశరథ మెమోరియల్ ఫౌండేషన్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించడం అభినందనీయమని జిల్లా సెక్టోరియల్ అధికారి జనార్దన్ అన్నారు. కీ.శే దశరథ హరికృష్ణ స్థాపించిన ఈ సంస్థ ద్వారా దాశరథ హరికృష్ణ స్మారక వార్షిక పోటీలను నిర్వహించి ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు,  మెడల్స్,  షీల్డ్ లను అందజేశారు. దశరథ మెమోరియల్ ఫౌండేషన్ను కీ. శె. హరికృష్ణ స్థాపించగా ఈ సంస్థ ఆధ్వర్యంలో  విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో హరికృష్ణ స్మారక వార్షిక పోటీలు నిర్వహించడమే కాకుండా రూ 10వెలు స్కాలర్షిప్ అవార్డు అందేయడం, ఆహార వితరణ,  హెల్త్ క్యాంపులు నిర్వహించడం  జరుగుతుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు వివరించారు.సేవ చేసే వారిని ప్రతి ఒక్కరు అభినందించాలని భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల ఉన్నతి కొరకు పాటుపడేందుకు ప్రతి ఒక్కరు సంస్థకు  సహకరించాలని కోరారు. అంతకు ముందు కీర్తిశేషులు హరికృష్ణ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు,  మెడల్స్, షీల్డ్ లు  బహుకరించి అభినందించారు. కార్యక్రమంలో దశరథ మెమోరియల్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కే.సురేష్ కుమార్, పట్టణ ఇన్చార్జి లింగాల శ్రీనివాస్, సెక్టోరియల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్,  పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల చంద్రశేఖర్,  ప్రధాన కార్యదర్శి చింత రెడ్డి రామలింగారెడ్డి,  ఉపాధ్యాయులు కోటయ్య,  తాళ్లపాక సాలయ్య,  అభిమల్ల రాకేష్ తో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు,  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..
Spread the love