హంతకుణ్ని అరెస్ట్ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చిన్నారులతో సహా ఆరుగురిని కసాయిలా నరికి పొట్టనబెట్టుకున్న నరమేధంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. పాశవిక చర్యకు పాల్పడిన నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలనీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. నిందితునికి బెయిలు రాకుండా చూడాలని సూచించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా నిందితున్ని పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటివరకూ అరెస్టు చేయకపో వడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నా రనీ, బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పే ర్కొన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
షాబాద్ నరమేధం అత్యంత విషాదకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



