
నవతెలంగాణ- మల్హర్ రావు
ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆల్ఫోర్స్ డా. వూట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నేడు సోమవారం మంథనిలోని ఎస్ఎల్ బి గార్డెన్ లో ఉంటుందని, ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులు హాజరు కానున్నట్లుగా తెలిపారు.కావున పట్టభద్రులు,విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎన్ఎస్ యుఐ కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.