మండలంలో తునికాకు కల్లాలు ప్రారంభం

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలంలో రెండు సెక్షన్ల కింద తూనికాకు కల్లాలను ప్రారంభించినట్లు అటవీ శాఖ సెక్షన్ అధికారి నర్సయ్య మంగళవారం తెలిపారు. ముత్తారం ఎ3 సెక్షన్ పరిధిలో అడవీ శ్రీరాంపూర్, ముత్తారం బి4 సెక్షన్ పరిధిలో కేశనపల్లి, దరియాపూర్, హరిపురం, మచ్చుపేట, పారుపల్లి, మైదబండ గ్రామాల్లో ఈ కల్లాలను ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. తూనికాకు కల్లాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Spread the love