Thursday, June 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅబద్దాలతో పెన్షన్ దారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

అబద్దాలతో పెన్షన్ దారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని, జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించి, జూన్ 2 న ఎందుకు పెన్షన్స్ మంజూరు చేయలేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD)తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య ప్రశ్నించారు. ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి వరమ్మ, కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు వి ఉపేందర్, సహాయ కార్యదర్శి యేశాల గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి శశికల లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా యం అడివయ్య మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నెలలో జరిగిన ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న 11రకాల చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూ చేసుకున్నారని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది. దరఖాస్తులు చేసిన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న స్పందించడం లేదు. 2026 ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్ జూన్ 2 నాడు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వలన లక్షలాది మంది చేయూత పెన్షన్స్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మీ సేవా కార్యాలయల నుండి సర్టిఫికెట్స్ తీసుకుని దరఖాస్తూ చేసుకున్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నాడు అమలు చేస్తామని చెప్పిన కొత్త పెన్షన్స్ ఎందుకు మంజూరు చేయలేదు.ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలో అనేక మీటింగ్లలో జూన్ 2న 2 లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రగల్బలు పలికి చేతులు ఎత్తివేయడం ఎంత వరకు సమంజసం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూ పరిపాలన చేయాలనుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని లేని యెడల ఉద్యమం తప్పధు.రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త పెన్షన్స్ పంపిణి కోసం వెంటనే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది.లేని యెడల జిల్లాలో మంత్రుల పర్యటనలను అడ్డుకోవాలని చేయూత లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -