Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సభను విజయవంతం చేయాలి 

సీఎం సభను విజయవంతం చేయాలి 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

జడ్చర్ల పట్టణంలో  నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయడానికి గ్రామ అధికారులు, మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విజయ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని వాడ్యాల్ గ్రామంలో  సర్పంచ్ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన  ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిడ్జిల్ మండలంలో అన్ని గ్రామాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడానికి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు గ్రామం నుంచి రాజకీయల కతీతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాలు ఉప సర్పంచ్ నాగరాజ్, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, అంగన్వా టీచర్ మహిమూద, హెల్త్ అసిస్టెంట్ దేవయ్య, వార్డ్ మెంబర్లు మల్లేష్, ఉదయ్ కుమార్, మహిళా సంఘ సభ్యులు ఆశా వర్కర్ నర్మదా, గ్రామస్తులు  భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -