ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుంది

– బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సిలివెరి మల్లారెడ్డి
నవతెలంగాణ – తొగుట
ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సిలివెరి మల్లారెడ్డి మండిపడ్డారు. గురువారం మండలంలోని జప్తీ లింగారెడ్డి పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠ శాలలో ఏర్పాటుచేసిన తల్లిదండ్రుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సూచన మేరకు తన సొంత నిధుల తో విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. గత 15, 20 సంవత్సరాలుగా పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు ప్రభు త్వం ప్రభుత్వ పాఠశాలలపై శ్రద్ధ వహించి పాఠశాల ల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తి నట్లు వ్యవహరించడం సరి కాదన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి మాట్లా డుతూ అడగగానే తమ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేసినందుకు ప్రత్యేక కృత జ్ఞతలు తెలియజేశారు. పాఠశాలలో ఎలాంటి సమ స్యలు రాకుండా వారు కృషి చేయడం సంతోషకర మన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మండల అధ్యక్షు డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love