సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహమే అసలుసిసలు తెలంగాణ తల్లి..

The statue set up in the secretariat is the mother of Telangana.– కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో నేడు ఏర్పాటు చేసిన విగ్రహమే అసలు సిసలు తెలంగాణ తల్లి రూపం అని,ఇదే తెలంగాణ సంస్క్రుతి కి ఆకృతి అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ మండల కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన తెలంగాణ సంస్క్రుతి ఉట్టిపడేలా నూతన ఆకృతి లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు.పేదలకు ఇచ్చే ఇందిరమ్మ గృహాలను,పూజించాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ప్రతి పక్షం రాజకీయాలకు వాడుకోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేసారు.రాజకీయాలు మాని ప్రజలు సంక్షేమం కోసం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుంకవల్లి వీర భద్ర రావు,జూపల్లి ప్రమోద్,పీఏసీ ఎస్ అశ్వారావుపేట అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,తగరం ముత్తయ్య,నండ్రు రమేష్,అప్పలరాజు లు పాల్గొన్నారు.
Spread the love