
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు. నిజామాబాద్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం.సాయ రెడ్డి, మాణిక్ రాజు లను హడ క్ కమిటీ సభ్యులు ఆకుల రమేష్, నరసింహ రెడ్డి, బాస రాజేశ్వర్ ల ఆధ్వర్యం లో ఎన్నికల అధికారి జె.వెంకటేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటుగా మహిళా ప్రతినిధి జె. రమాదేవి, కోశాది కారిగా నారాయణ దాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య క్రమంలో మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్,జి. పి .సు దర్శన్,అదనపు పి.పి. బంటు వసంత్,సీనియర్ జూనియర్ న్యాయ వాదులు ఇతర నూతన కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికలు ఆలస్యం గా జరిగినందున నలుగురితో ప్రమాణ స్వీకారం చేయించారు మిగితా వారితో త్వరలో ప్రమాణ స్వీకారం చేయించు తమని అధ్యక్షులు సాయ రెడ్డి తెలిపారు.