విద్యార్థుల ప్రతిభకు దోహద పడతాయి..

– వార్షిక అవార్డుల దినోత్సవంలో డిప్యూటీ ఈఓ సయ్యద్ ఖాజా ముకరం
నవతెలంగాణ – ధూల్ పేట్
విద్యార్థుల ప్రతిభకు కల్చరల్ కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయనీ, బహదూర్‌పుర డిప్యూటీ ఈఓ సయ్యద్ ఖాజా ముకరం అన్నారు. పాతబస్తీ జాహనుమా లోని సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ క్యాంపస్‌లో  2023-24 వార్షిక అవార్డుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా  నిర్వహించిన పలు పోటీలలో ప్రతిభను కనబరచిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. అవార్డుల ఉత్సవాల్లో విద్యార్థులు ఆత్మీయ ప్రదర్శన, ప్రార్థన, కుటుంబ విలువలు, దేశభక్తి, సామాజిక ప్రదర్శనలు, నృత్యాలు, శాస్త్రీయ స్వాగత నృత్యం ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వివిధ తరగతి విద్యార్థులచే థీమ్ ఆధారిత నృత్యాలు అద్భుతంగా ప్రదర్శించారు. తల్లిదండ్రుల ప్రేమ” అనే థీమ్‌పై 9వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక బొనాంజా తల్లిదండ్రులు చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ బ్రదర్ బాల షోరీ, రెవరెండ్ బ్రదర్ టోనీ, రెవరెండ్ బ్రదర్ యేసు ప్రబాహరన్, రెవరెండ్ బ్రదర్ అరుణ్, రెవరెండ్ బ్రదర్ షో రెడ్డి, రెవరెండ్ బ్రదర్ ఆంథోనీ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love