
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం మహేష్ టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాశెట్టి సుమన్ కుమార్ ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమన్ కుమార్ ఉద్యోగుల సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించిన మహేష్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నుడా చైర్మన్ కేశ వేణు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్రభాద్యులు పోల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుడికందుల సంజీవయ్య, కోశాధికారి టి.దినేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్ ,ఉమా కిరణ్, ప్రకాష్, జాన్ వెస్లీ, శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.