రాజీమార్గమే రాజమార్గం: ఎస్ఐ ఓంకార్ యాదవ్

నవతెలంగాణ- తాడ్వాయి
 రాజీ మార్గమే రాజమార్గమని, తాడ్వాయి ఎస్ ఐ, ఓంకార్ యాదవ్  అన్నారు. మంగళవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో లోకదాలత్ విషయమై ఎస్ ఐ, ఓంకార్ యాదవ్ మాట్లాడారు. ములుగు జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 09 వరకు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో కక్షి దారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకునేల లోక్ అదాలత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు  షేక్ మస్తాన్  తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడదగు కేసులు,క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ కుటుంబ తగాదా కేసులు,ఆక్సిడెంట్ కేసులు,చిట్ ఫండ్ కేసులు, డిజాస్టర్ మనేజ్మెంట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ట్రాఫిక్ ఈ – చలన్ కేసులు, ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారం తో పరిష్కరించుకోవచ్చు .కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్ష దారులు హాజరు అయ్యి తమకేసులను వారికీ వీలైన రోజునే సెప్టెంబర్ 9 లోపు పరిష్కరించుకునేల అవకాశం కల్పిస్తుందని ఎస్సై  తెలిపారు. ఈ అవకాశాన్ని సంబంధిత వ్యక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Spread the love