కుర్ కురే ప్యాకెట్ తీసుకురాలేదని విడాకులు కోరిన భార్య

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళకు రోజూ కుర్‌కురే తినే అలవాలు ఉండేది. కుర్ కురే అంటే తనకు ప్రాణం అని భర్తకు చెప్పేది. భర్త కూడా రోజూ వాటిని తెచ్చి ఇచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసేవాడు. ఒకరోజు కుర్‌కురే తీసుకురాకుండా చేతులూపుకొంటూ వచ్చిన భర్తను చూసి అలిగి పుట్టింటికి వెళ్లిన ఆమె కొన్ని నెలల తర్వాత విడాకులకు దరఖాస్తు చేసింది. ప్రతిరోజు జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందనే కారణంతోనే ఒకరోజు తాను కుర్ కురే తీసుకురాలేదని తెలిపాడు. కుర్‌కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది.

Spread the love