ఆయిల్ ఫాం టన్ను గెలలు ధర రూ.13,438

– ఏప్రియల్ నెల కంటే రూ.791 లు తగ్గుదల

నవతెలంగాణ – అశ్వారావుపేట
మే నెల కు చెల్లించాల్సిన ఆయిల్ ఫాం గెలలు ధర ను ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు శనివారం ప్రకటించారు.టన్ను గెలలు ధర రూ.13,438 లు నిర్ణయించామని ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి తెలిపారు. ఏప్రియల్ నెలలో టన్ను గెలలు కు రూ.14,229 లు చెల్లించారు.ఈ నెల తో పోల్చితే మే నెలలో టన్ను కు రూ.791 లు తగ్గింది. వాతావరణం లో వచ్చిన మార్పులకు ఈ ఏడాది గెలలు దిగుబడి సైతం తగ్గుముఖం పట్టింది.దీనికి తోడుగా గెలలు ధర సైతం అంతంత మాత్రమే ఉండటంతో రైతులు నిరాశకు గురి అవుతున్నారు.
నెల                   ధర                    హెచ్చుతగ్గులు
జనవరి            12,681                     
ఫిబ్రవరి            13,135              +    454
మార్చి              14,174              +  1,039
ఏప్రియల్          14,229              +      55
మే                    13,438              –     791
Spread the love