ఆయిల్ ఫామ్ సాగుతో ఖచ్చితమైన నికర లాభం ఉంది 

– నల్లగొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి వి.వి.ఎస్ సాయిబాబా
 నవతెలంగాణ  – చండూరు 
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు కచ్చితమైన నికర లాభం ఉందని నల్లగొండ జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి వి.వి.ఎస్. సాయిబాబా, హార్టికల్చర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ఎస్.శ్రీనివాస్ అన్నారు.  మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పామ్ ఆయిల్ మొక్కలు వేసుకున్న రైతులకు ఒక్క ఎకరానిరూ. 4,200పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుందనివారు అన్నారు.
ఎస్సీ, ఎస్టి రైతులకు 100శాతం, బీసీ రైతులు మరియు ఐదు ఎకరాల లోపు ఉన్న ఓసి రైతులకు 90శాతం రాయితిని ఇస్తుందన్నారు. ఓసి రైతులందరికీ80 శాతంరాయితి ని ఇస్తుందని, దీనితోపాటు రైతులు మాత్రం7 శాతం జిఎస్టినీ కట్టాలని, 11 శాతం జిఎస్టిని ఉద్యాన శాఖ భరిస్తుందనివారు అన్నారు. ఆయిల్ ఫామ్ వేసుకున్న రైతులకు నాలుగు సంవత్సరాల నుండి పంట దిగుబడి ప్రారంభమై, 35 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుందనివారు తెలిపారు. ఒక్కసారి పామ్ ఆయిల్ పంట వేస్తే, 35 సంవత్సరాల వరకు ప్రతినెల ఆదాయం వచ్చే  ఏకైక పంట పామాయిల్ అని వారు అన్నారు. పతాంజలి  ఫుడ్స్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. యాదగిరి మాట్లాడుతూ, మార్కెట్ కు ఇబ్బంది లేని పంట ఆయిల్ పామ్ ని, అతి త్వరలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. రైతులకు ప్రతినెల పేమెంట్ ఇచ్చేఏకైక పంట ఆయిల్ ఫామ్, రైతు పండించిన పంటకు కొనే బాధ్యత మా కంపెనీ దేఅని ఆయన అన్నారు.
మునుగోడు క్లస్టర్ హార్టికల్చర్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ, మునుగోడు క్లస్టర్ పరిధిలోని మునుగోడు,చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలలో ఇప్పటికే202మంది రైతులు850 ఎకరాలలో సాగు చేస్తున్నారనిఆయన అన్నారు.అనంతరం నెటాపిమ్ కంపెనీ సీనియర్ ఆగ్రోనోమిస్ట్ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ,మొక్కలకు నీటి యజమాన్యం, ఎరువుల యజమాన్యం గురించి రైతులకు చక్కగా వివరించారు.రైతులందరూ ఆయిల్ ఫామ్ పంట వేయడానికి ముందుకు రావాలనివారు రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చరల్ అధికారి ఎస్. శ్రీనివాస్, నెటాపిమ్ కంపెనీ సౌత్ ఇండియా ఆగ్రో నోమిస్ట్ అధికారి ఏ.వి సుబ్బారావు, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. యాదగిరి,నల్లగొండ జిల్లా ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి, పతాంజలి కంపెనీ ఫీల్డ్ అసిస్టెంట్స్ యాదయ్య, మోహన్, సురేష్,స్వామి,వెంకటేష్,శ్రీనుతో పాటు120 మంది రైతులు పాల్గొన్నారు.
Spread the love