ఈ వంతెనకు మొక్షం ఎన్నడు.?

– రెండేళ్లుగా ఆగిన నిర్మాణ పనులు
– ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
– అధికారులకు పట్టింపు లేదా
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా జిల్లా కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి లోని పెద్దవూర మండల కేంద్రం లో చిన్న వాగుపై ఉన్న నిజాం కాలం నాటి పాత వంతెన పక్కన నూతన వంతెన ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్లు కింద 50 లక్షల రూపాయలు వ్యయం తో చేపడుతున్న వంతెన  పూర్తి కాక ఇప్పటికి పెండింగు లోనే ఉంది.ఇటు అటు రెండు వైపుల వంతెనకు సరిపడా గ్రావెలింగ్ పనులు బి టీ వేసే పనులు అలాగే పెండింగ్లో ఉంచారు. ఇంకా 40 శాతం పనులు  వదలి వేయడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. నాగార్జున సాగర్, హైదరాబాద్ జాతీయ రహదారి వంతెన ప్రాంతం లో గతుకుల తో పనులు పూర్తి కాక వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కోదాడ జడ్చర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒక కిలోమీటర్ దూరం మండలం కేంద్రం లోరోడ్డు పనులు నిలిపి వేశారు.ఈ విషయం పట్ల అధికారులు పట్టించుకోవడంలేదని పలు విమర్శలు వస్తున్నాయి.వేసవి కాలం కూడా పూర్తి కావొస్తుంది.ఆలోగా వర్షాలు పడనే పడ్తవని ఈ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు అని జనాలు చర్చించుకొంటున్నారు.వర్షాకాలం ప్రారంభం నాటికైనా  ఈ వంతెన వద్ద పనులు, రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించి రాకపోకలు మెరుగగునట్లు చూడాలని సంబంధిత అధికారులను,నాయకులను పలువురు మండల ప్రజలు కోరుతున్నారు.
Spread the love