ఆర్భాటం ఆరు పాళ్ళు పని మూడు పాళ్ళు అన్నట్టుంది ఈ బడ్జెట్

– పేదలకు కూలీలకు ఒరిగిందేమీ లేదు

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట రాములు 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
పేదలకు సంవత్సరానికి ₹12,000 ఇస్తానన్నారు. అలాగే ఉపాధి పని దినాలను 150కి పెంచి కనీస వేతనం 400 ఇస్తామన్నారు. పట్టణ ప్రాంతంలో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వీటి అడ్రస్ ఎక్కడ బట్టి గారు ? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు ఒరిగింది ఏందో చెప్పండి బట్టి గారు ? మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ₹2500 నెలకు ఇస్తామన్నారు, అలాగే ₹4000 పింఛన్లు ఏమైనాయి ? రేషన్ కార్డుల గురించి స్పష్టత లేదు, ఇందిరమ్మ ఇండ్ల గురించి స్పష్టత లేదు, వైద్య ఆరోగ్య పథకానికి కేటాయించిన నిధులు చూస్తుంటే ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే వాళ్లకు పది లక్షల రూపాయలు ప్రశ్నార్ధకమే. కౌలు రైతులకు రైతు భరోసాని అమలు చేస్తామన్నారు అది కనుచూపుమేరలో కనిపించట్లేదు. మరి బడ్జెట్ ఎవరికోసం ప్రవేశపెట్టినట్లో అర్థం కావట్లేదు. ఇచ్చిన హామీలన్నిటిపై సమగ్రంగా సమర్థవంతంగా సవరించి పేదలకు, కూలీలకు ప్రభుత్వంపై వ్యతిరేకత రాకముందే ప్రయోజనార్ధకంగా మార్చాలని తెలంగాణ వ్యవసాయ కారణంగా డిమాండ్ చేస్తున్నది.
Spread the love