భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో మూడు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడారు ఉపాధి వాచర్ గా ఎండి ఇబ్రహీం,గ్రామపంచాయతీ ఉత్తమ సిబ్బందిగా కాల్వ పోశాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పూర్తిచేసిన కూలిగా గాదనివేన రాజయ్య లను సత్కారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.