వేల గొంతులు లక్షల డప్పులు మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చెయ్యాలి

– కరపత్రాలు, గోడ ప్రతులు ఆవిష్కరణ
నవతెలంగాణ కంఠేశ్వర్ 
ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్లో విజయవంతం చేయాలని కరపత్రాలను గోడప్రతులను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పూలాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేల గొంతులు లక్షల డప్పుల గోడ ప్రతులు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, ప్రముఖ కవి రచయిత మచ్చ దేవేందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7 నాడు జరిగే వేల గొంతులు లక్షల డప్పులు మహా ప్రదర్శనను నిజామాబాద్ జిల్లా నుంచి వేలాదిగా డప్పులతో బయల్దేరి విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రతి గోడ ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి చేరేలా చూడాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. అలాగే ప్రతి మాదిగ ఇంటికి కరపత్రం చేరేలా చూడాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎం ఈ ఎఫ్ జాతీయ నాయకులు తెడ్డు గంగారాం, ఎం ఈ ఎఫ్ జిల్లా కన్వీనర్ మారుతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ, లసింగరి భూమయ్య మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున, సత్తేక, జిల్లా నాయకులు పద్మ, సుధ, ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు శ్యాం మాదిగ, వివిధ మండలాల అధ్యక్షులు, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు కనక శ్రీదిప్ మాదిగ, కళ మండలి జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love