రథసప్తమి లో తిప్పర్తి నరసింహారెడ్డి

నవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో రథసప్తమి పండుగ సందర్భంగా బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పర్తి నర్సింహ రెడ్డి ని గ్రామ నాయకులు శాలువాతో సన్మానం చేశారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు రైతాంగం సుఖ సంతోషాలతో స్నేహ భావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచు వేణుగోపాల్ రెడ్డి, లింగమయ్య యాదవ్, బూషిరాజ్ మల్లయ్య, గుద్దటి బాలరాజు, గణేష్, నాగిరెడ్డి, వంగ ప్రదీప్ రెడ్డి, వెంకటేష్, హర్ష, రాజేందర్ రెడ్డి దుమ్మడ్ , అచ్చుట్, కిట్టు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love