అమరులకు నివాళులర్పించిన టీజేఎస్‌ నాయకులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెత్తరమాస సందర్భంగా తెలంగాణ అమరవీరులకు టీజేఎస్‌ నాయకులు నివాళులర్పించారు. ప్రతీ సంవత్సరం పెత్తరమాస రోజున తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని స్మరించుకుంటూ గన్‌పార్క్‌ మృతవీరుల స్థూపం వద్ద బియ్యమిచ్చే సాంప్రదాయాన్ని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సడక్‌ బంద్‌ నేపథ్యంలో ఆయన గృహ నిర్బంధం చేయడంతో ఇంటివద్దనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచినా ఆత్మహత్యలు ఆగకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love