జీవితంలో ఎదగాలంటే…

జీవితంలో ఎదగాలంటే కేవలం అదష్టం లేదా మెరుగైన పరిస్థితులు మాత్రమే అవసరం కాదు. మన ఆలోచన విధానం, అలవాట్లు, ప్రవర్తన ఈ ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అవేంటో ఒక చిన్న రైతు కథ నుండి తెలుసుకుందాం.
రాము ఒక రైతు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది. తన తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యత అంతా అతనిదే. అతనికి ఓ పెద్ద కోరిక… తన వ్యవసాయాన్ని విస్తరించాలి, పెద్ద పొలాలు కొనాలి, మరింత ధనవంతుడవ్వాలని. ఒకరోజు ఆనంద్‌ అనే గొప్ప వ్యాపారవేత్త రాము పొలం పక్కనే ఉన్న భూమి కొంటున్నాడు. అతను రాముతో మాట్లాడి, ఎదగాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు అలవర్చుకోవాలి. అవే నిన్ను ఒక సాధారణ రైతునుంచి గొప్ప వ్యక్తిగా మార్చుతాయి అని తన విజయ రహస్యాలు చెప్పడం మొదలుపెట్టాడు…
1. ప్రాక్టీస్‌ మైండ్‌సెట్‌(Growth Mindset): ‘నాకు అవకాశం లేకపోతే?’ అని కాదు, ‘నేను ఎలా నేర్చుకోవచ్చు?’ అని ఆలోచించు. ఎదగాలంటే మనం నిరంతరం కొత్తది నేర్చుకోవాలి.
2. నిత్యం లక్ష్యసాధన (Goal- Oriented Thinking):: రాముని దగ్గర చిన్న పొలం మాత్రమే ఉంది. కానీ అతను దీన్ని రెండు సంవత్సరాల్లో రెండింతలు పెంచుకోవాలి అని లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.SMART Goals (Specific,  Measurable, Achievable, Relevant, Time-bound) ప్రకారం, సరైన విధంగా లక్ష్యాన్ని పెట్టుకోవడం విజయం కోసం కీలకం.
3. క్రమశిక్షణ (Discipline),  పట్టుదల(Perseverance): రాము రోజూ ఒక కొత్త వ్యవసాయ పద్ధతిని పాటించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజు ఉదయమే లేచి పని చేయడం, కచ్చితమైన దినాలను పాటించడం అతనికి విజయాన్ని తెచ్చిపెట్టింది. సైకాలజీలో Delayed Gratification అనే సిద్ధాంతం ప్రకారం, తక్షణ ప్రయోజనాలను వదులుకుని, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కష్టపడే వారే విజయవంతమవుతారు.
4. నెగటివ్‌ ఆలోచనలను జయించడం (Overcoming Negative Thoughts): తన పొలంలో కురిసిన వర్షాలకు నష్టపోయినప్పుడు, రాము తొలుత కుంగిపోయాడు. కానీ Cognitive Behavioral Therapy (CBT) లో చెప్పిన విధంగా, ”నా చేతుల్లో ఏముంది?” అని ఆలోచించడం ప్రారంభించాడు. అందువల్ల, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు.
5. సరైన సంబంధాలు (Networking & Social Skills): రాము తన గ్రామంలోని ఇతర రైతులతో కలిసాడు. కొత్త టెక్నాలజీలు, విత్తనాల గురించి మాట్లాడాడు. విజయం కోసంSocial Intelligence (సమాజంతో కలవడం, సహాయం కోరడం, పరస్పర సహాయ సహకారాలు) ఎంతో అవసరం.
6. ఆత్మవిశ్వాసం, ధైర్యం (Self- Confidence & Courage): అతని పొలం అభివద్ధి చెందాక, అతను మార్కెట్‌లోకి వెళ్లి ప్రత్యక్షంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘నా వద్ద సరైన సామర్థ్యం ఉందా?’ అనే అనుమానాన్ని తొలగించుకున్నాడు.Self-Efficacy Theory (Albert Bandura) ప్రకారం, ఒక పని చేయగలం అని నమ్ముకున్నవారే ఎక్కువగా విజయం సాధిస్తారు.
7. ధనాన్ని సక్రమంగా నిర్వహించడం(Financial Intelligence): తన తొలి సంవత్సర ఫలితం అమ్మిన తర్వాత, పొలం పక్కనే ఉన్న భూమిని కొనడం మంచిదా, లేక కొత్త విత్తనాలు కొనాలా? అని ఆలోచించాడు. సరైన Financial Planningఎదగడంలో సహాయపడుతుంది.
ఎలా ముగిసింది?
రాము తన అలవాట్లను మార్చుకున్నాడు. కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని, మార్కెటింగ్‌లో ప్రవేశించి తన పొలాన్ని విస్తరించాడు. దశాబ్దం తర్వాత, అతను తన జిల్లాలో గొప్ప రైతుగా, వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఈ కథలో రాము తీసుకున్న మార్గం మనం ఎలా ఎదగాలో చూపిస్తుంది. దీని వెనకున్న సిద్ధాంతాలు:
1. Growth Mindset – ఎదగాలనే తాపత్రయం ఉండాలి.
2. Goal-Setting Theory – లక్ష్యాన్ని సరైన విధంగా పెట్టుకోవాలి.
3. Discipline & Delayed Gratification – తక్షణ సంతప్తిని వదులుకొని భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టాలి.
4. CBT (Cognitive Behavioral Therapy) – నెగటివ్‌ ఆలోచనలను మార్చుకోవాలి.
5.Social Intelligence – సరైన వ్యక్తులతో కలిసిపోవాలి.
6.Self-Efficacy Theory – ‘నేను చేయగలను’ అనే విశ్వాసం ఉండాలి.
7.Financial Intelligence- డబ్బును తెలివిగా నిర్వహించాలి.
ఇవే మిమ్మల్ని ఒక సాధారణ మనిషినుంచి అసాధారణ వ్యక్తిగా మార్చే అలవాట్లు!
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love