
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్పేర్ అసోసియేషన్ యూనియన్ బలోపేతానికి గ్రామీణ వైద్యులు సమిష్టిగా ముందుకు వెళ్లాలని భూపాలపల్లి ఆర్ఎంపీ, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహాముత్తారం మండల అధ్యక్షుడు కాసర్ల రాజ్ కుమార్ అధ్యక్షతన యామనపల్లి గ్రామంలో మండస్తాయి గ్రామీణ వైద్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ముఖ్యదితిగా హాజరై మాట్లాడారు. పల్లెల్లో గ్రామీణ వైద్యులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళవద్దని, పరిమితికి మించిన వైద్యం చేయరాదని సూచించారు. అందరూ ఐక్యంగా ఉంటూ యూనియన్ నియమ,నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా కేంద్రము, కాటారం సబ్ డివిజన్ తోపాటు అన్ని మండల కేంద్రాలలో యూనియన్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం, నిలిసిపోయిన పారా మెడికల్ శిక్షణ తరగతులు పున: ప్రారంభానికి త్వరలో స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లకు విజ్ఞప్తి చేయునట్లుగా తెలిపారు.అనంతరం తొలిసారి మండలానికి విచ్చేసిన జిల్లా కార్యవర్గాన్ని మండల కార్యవర్గం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిడుదొడ్ల రాజు,ఉపాధ్యక్షులు చింతల కుమార్ యాదవ్,దొడ్ల అశోక్,రఘు,ఈసి మెంబర్ రవి,మండల ప్రధాన కార్యదర్శి శంకర్,ఉపాధ్యక్షుడు రవి తోపాటు ఆయా గ్రామాల వైద్యులు పాల్గొన్నారు.