నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా పసిడికి డిమాండ్ స్థిరంగా ఉండటంతో ధరల్లో తగ్గుదల కనిపించడం లేదు. నేటి ఉదయం అందిన ధరల వివరాల ప్రకారం, బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర ఏకంగా రూ.2,70,000 వద్ద నమోదైంది. ఇక పసిడి ధరల విషయానికొస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,500 ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,320గా పలుకుతోంది. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,240 ఉండగా, చెన్నైలో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,300గా నమోదైంది.


