
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ స్వయంభు వేణుగోపాల స్వామి ఆలయ శిఖర శ్రీ సుదర్శన పున ప్రతిష్టాపన మహోత్సవం సనాతన గంగోత్రి శ్రీ రామానుజ పీఠాధిశ్వర శ్రీ శ్రీ రామానుజ దాస స్వామి, కేదారేశ్వర పీఠాధిశ్వర శ్రీశ్రీశ్రీ మంగి రాములు మహారాజ్ కరకాములములచే ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంప్రదాయపదంగా వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని ఆలయ అధ్యక్షుడు సి శ్రీనివాస్ రెడ్డి, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆలయ శిఖర శ్రీ సుదర్శన పున ప్రతిష్టాపన మహోత్సవం 11న ఆలయంలో ఉత్తరా నక్షత్ర యుక్త శుభ ముహూర్తము వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున ధర్మశాస్త్ర రత్నాకర శ్రీ సాంప్రదాయ రత్న ఆగమ విశారద శ్రీమాన్ చిలకమర్రి శ్రీ వర్ధనాచార్యులు యజ్ఞచార్యత్వమున ఏకకుండాత్మకంగా మూడు రోజులపాటు పలు పూజ యజ్ఞ కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణాల మధ్య వైభవంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. గురువారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారి నవ కలశ శాంతి స్వపనము అవహిత దేవాహపూజ శ్రీ సుదర్శన స్వామికి పంచామృతాభిషేకం ప్రాణ ప్రతిష్టా హోమం ప్రాణ ప్రతిష్ట పల పుష్పాదివాసము గర్త వ్యాసము శ్రీ సుదర్శన నారసింహ హోమం పూజ హారతి కార్యక్రమాలు వైభవంగా సాగాయని తెలిపారు. అనంతరం 11న ఉదయం ఆవాహిత దేవత పూజ శ్రీ సుదర్శన మూర్తి షోడపో పచార పూజ, మహా పూర్ణాహుతి హోమము ఇరువురి స్వాముల వారి కరకములచే ఆలయ శిఖరం పైన శ్రీ సుదర్శన స్థిర ప్రతిష్ట మహ అభిషేకము అదృష్టం పూర్ణ అపూర్వ నివేదన అదృష్ట పూర్ణ అపూర్వ వికిరణ హరితి పూజ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. 12న శనివారం ఆలయ మహోత్సవంలో భక్తులకు పెద్ద ప్రసాద , అన్నదాన వితరణ నిర్వహిస్తారని తెలిపారు కంఠేశ్వర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు నగర ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో ఈ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సు లు పొందాలని, ఈ మహోత్సవం వైభవంగా సాగేలా భక్తులు తమ వంతు సహకరించాలని ఆలయ ధర్మకర్త మండలి తేజస్విని, తుమ్మ ప్రవీణ్, కులగని నర్సింగ రావ్, గజల శ్యాం రాజ్, సంగవి అశోక్, లక్ష్మీ నారాయణ, ఆలయ కోశాధికారి కోన ప్రవీణ్ గుప్తా, కార్యశీల కార్యదర్శి లోగం రాజేశ్వర్, లక్ష్మి , ఆలయ అర్చకులు కృష్ణస్వామి కోరుతున్నారు.