రేపు విద్యుత్ వినియోగదారుల సదస్సు..

– తాడ్వాయి ఎన్పీడీసీఎల్ ఇన్చార్జి రమేష్ 
– విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ -తాడ్వాయి 
మల్లంపల్లి మండల కేంద్రంలో ని సబ్ స్టేషన్ లో రేపు శుక్రవారం విద్యువినియోదారుల సదస్సు(సి జి ఆర్ ఎఫ్) నిర్వహించనున్నట్లు తాడ్వాయి ఎన్పీడీసీఎల్ ఇన్చార్జి ఏఈ రమేష్ తెలిపారు. ముఖ్య అతిథులుగా సి జి ఆర్ ఎఫ్-1 చైర్ పర్సన్ ఎన్ వి వేణుగోపాల చారి వస్తున్నట్లు తెలిపారు. లోకల్ కోర్టులో విద్యుత్ సమస్యలు, విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు, నూతన సర్వీసులు మంజూరు, అదనపు లోడ్ క్రమదీకరణ, సర్వీస్ రద్దు, కేటగిరి మార్పు తదితర సమస్యలపై ఉదయం 10:30 గంటల నుంచి 1:00 (ఒంటిగంట) వరకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Spread the love