టిఆర్ టిడిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి 

– డిఈడిబిఈడి నిరుద్యోగుల అభ్యర్ధుల సంఘం
నవతెలంగాణ- కంటేశ్వర్
టిఆర్ టి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఈడిబీఈడీ, నిరుద్యోగుల అభ్యర్థుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డిఈడి, బిఈడి, నిరుద్యోగ అభ్యర్ధుల సంఘం అధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా డిఈడి, బిఈడి నిరుద్యోగ అభ్యర్ధుల సంఘ ప్రతినిదులు మాట్లాడుతూ 2022 మార్చ్ లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్  ఉద్యోగ కల్పన ప్రకటనలో భాగంగా 12 వేల ఉపాధ్యాయుల ఖాళీల గురించి ప్రస్తావించి, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని అన్నారు.అదే విధంగా గత సంవత్సరం జూన్ 12న టెట్ నిర్వహించారు. అలాగే డీఎస్సీ, టిఆర్టి, మాత్రం ఇప్పటివరకు నిర్వహించపోవడం వలన దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టెట్ పరీక్షకు సంబంధం లేకుండా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్త డి ఈ డి, బిఈడి, నిరుద్యోగ అభ్యర్ధుల సంఘ అభ్యర్ధులను ఏకం చేసి ఈ నెల 18వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయి, దత్తు, మహేష్, మౌన శ్రీ, జ్యోతి, స్వప్న, కృష్ణవేణి, సమీర, సుధాకర్, రవి, శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.
Spread the love