షాట్ సర్క్యూట్ తో ట్రాక్టర్, గడ్డివాము దగ్దం..

నవతెలంగాణ – తొగుట
విద్యుత్ వైర్ షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెల రేగి ప్రమాద వశాత్తు ట్రాక్టర్, పశువుల మేత గడ్డివాం దగ్ధం అయిన సంఘటం మండలంలోని లింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం బాధితుడు దాసని మహిపాల్, గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం మహిపాల్ బోర్ మోటార్ వేసేందుకు వెళ్ళాడు. బోర్ మోటార్ స్టాటర్ ప్రారం భించగానే వైర్లు షాట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుం డా పోయింది. మంటలకు గాలి తోడు కావడంతో మరింత వేగంగా మంటలు వ్యాప్తి చెంది అక్కడే ఉన్న జాండీయర్ ట్రాక్టర్, గడ్డివాం, డ్రిప్ పైఫులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. బాధితునికి
దాదాపు రూ. 3.50 లక్షల ఆర్థికంగా నష్టం వాటి ల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Spread the love