Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి: ఎస్ఐ

ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి: ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమని, అతివేగం ప్రాణాంతకమని కొయ్యుర్ ఎస్-2 రాజన్ కుమార్ హెచ్చరించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో రోడ్డు ప్రమాధాలపై జిల్లా ఎస్పీ సంకీర్ట్, కాటారం డిఎస్పీ సత్యనారాయణ ఆదేశాలతో అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడుపొద్దని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -