నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీశాఖలోని ఎనిమిది మంది ఐఎఫ్‌ఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జీవో నెంబర్ 1504ని జారీ చేసింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(ఐటీ అండ్ డబ్ల్యూపీ)గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక వర్గీస్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(చార్మినార్ సర్కిల్)కు బదిలీ అయ్యారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(ఎస్‌టీసీ సర్కిల్, హైదరాబాద్)గా విధులు నిర్వహిస్తున్న శివాల రాంబాబు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(జోగులాంబ సర్కిల్, మహబూబ్‌నగర్)కు బదిలీ అయ్యారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డు డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ జూపార్క్‌ల డైరెక్టర్‌గా డాక్టర్ సునిల్ ఎస్.హిరిమత్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పి.శ్రీనివాసరావు ములుగు ఎఫ్‌సీఆర్‌ఐకు బదిలీ అయ్యారు. ఎస్.వి.ప్రదీప్‌శెట్టి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎస్‌టీసీ సర్కిల్‌కు స్థానచలనం పొందారు. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్టు డైరెక్టర్‌గా కె.శ్రీనివాస్, జె.వసంత నెహ్రూ జూ పార్కు క్యూరెటర్‌గా బదిలీ అయ్యారు. మందాడి నవీన్‌రెడ్డి జయశంకర్ భూపాపల్లి జిల్లా అటవీశాఖ అధికారిగా స్థానచలనం పొందారు.