కలవరం రేపిన డివిజన్లోని ఉద్యోగి బదిలీ..

నవతెలంగాణ – ఆర్మూర్  

మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వస్థలం వేల్పూర్ విద్యుత్ శాఖ ఏఈ యశ్వంతరావు బదిలీ ఉమ్మడి జిల్లాలోని కలవరం రేపింది .సోషల్ మీడియాలో ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదు పై ఆయనను నిర్మల్ జిల్లాకు బదిలీ చేయడం చర్చనీయం అయింది. అయితే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులే ఓ పార్టీకి వత్తాసు పలుకుతూ మెసేజ్ చేయడంతో, ఆ మెసేజ్ ను ఏఈ ఫార్వర్డ్ చేసినట్టు విద్యుత్ అధికారులు గురువారం తెలిపారు.

ప్రచారంలో పాల్గొన్న.. రాజకీయాల్లో తల దూర్చిన…
పార్లమెంట్ ఎన్నికల సందడి ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. .రాజకీయాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల కు రాజకీయాలంటే ఇష్టపడేవారు ఉంటారు. కాగా ఎన్నికల కమిషన్ నిబంధనలను కఠిన తరం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాజకీయాల్లో తల దూర్చొద్దు. పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారాల్లో ప్రత్యక్షంగా కానీ పరీక్షంగా గాని పాల్గొనవద్దు. ఇది నిబంధన అయితే కొంతమంది ఇదేమి పట్టనట్టు ప్రచారాలలో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఇతర జిల్లాలలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పార్టీ ప్రచారాలు పాల్గొంటున్నారు లేదో అని నిగవర్గాలు, ఎన్నికల కమిషన్ కూడా ఆరా తీస్తున్నాయి. సాధారణంగా వేసవి సెలవులు, విద్య సంవత్సరం ప్రారంభం సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇతర నాయకులు తమ సంఘాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గతంలో నిర్వహించినారు.. కొన్ని ప్రభుత్వ ,అనుకూల సంఘాలు గుట్టుగా తమ వారి కోసం ప్రచారాలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేక నిఘా..
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే సంఘాల పేరుతో రాజకీయ నాయకుల ప్రచారాలు కొనసాగిస్తున్నార నే ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలలో గతంలో ఎన్నికలలో ప్రచారంలో పాల్గొని సస్పెన్షన్కు గురైన ఉద్యోగ ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు.. ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటే మాత్రం ఇక ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది..
Spread the love